ఇరుగు పొరుగు సంబంధాలు
పక్కింటాయన ఎదురింటాయన ముందింటాయన వెనకింటాయన కిందింటాయన పైనింటాయన ఇలాంటి బేధభావాలేమి లేని గొప్ప ఇల్లాలు మన కళ్యాణమ్మ
ఉప్పు పప్పు పప్ప ఎదడిగినా కాదనకుండా ఇచ్చేసే పేద్ద ద్ద ద్ద ద్ద .... ది (మనసు) ఈమెది. ముందు నవ్వుద్ది తిరిగి నవ్వితే చాలు ఇచ్చేస్తది ఐతే ప్రతీదానికి ఒక వెల - దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది చక్కగా గ్రహించిన కుటుంబం
ఇంట్లో మగవాడి సంపాదన అనేది జు జు బి.. అనేది వీళ్ళ నమ్మకం రుజువు చేసారు కూడాను!
సుబ్రహ్మణ్యంగారు గిటకబారిన పెద్దమనిషి, పెద్ద ద్ద ద్ద ద్ద మనసున్న మనిషి. పాపం ఈయన పెద్దగా లేకపోవడం వలన కాళ్ళు చేతులు ఏవి సరిపోక తన బట్ట తల వాడుతారు కళ్యాణమ్మకి ఎంతోకొంత సంతోషం కలిగించటంకోసం, ఈవిడకూడ ఉడతాభక్తికి మిడతాతృప్టి అన్నట్టు అల్ప సంతోషం చెందుతుంది
పొద్దు పొద్దున్నే తల స్నానం చేసి మడి కట్టుకొని టేపురికార్డర్ లో - ఓ సుబ్బరావో ఓ అప్పరావో ( బొబ్బిలి పులి చిత్రం నుంచి ) .. పాట వింటూ చీర తొడల పైకి ఎగ్గట్టి వంగి నడి వీధిలో ముగ్గువేసి (అన్ని వీధుల్లో జనాలకి కనుల విందు - అంత బాగుంటది ముగ్గు మరి) ఇంట్లో పనులు చేస్తుంది.
Comments
Post a Comment